Tuesday, December 11, 2012

తెలుగు ఇతర ద్రావిడ భాషల అభివృద్ధికి కంకణం కట్టుకున్నాం

తెలుగు ఇతర ద్రావిడ భాషల అభివృద్ధికి కంకణం కట్టుకున్నాం
ఆచార్య కంకణాల రత్నయ్య
ఉపాధ్యక్షులు 
ద్రావిడ విశ్వవిద్యాలయం


ద్రావిడ విశ్వవిద్యాలయంలో తెలుగు పండుగ


ద్రావిడ విశ్వవిద్యాలయంలో జరిగిన రెండు రోజుల తెలుగుపండుగలో ఉపాధ్యక్షులు ఆచార్య కంకణాల రత్నయ్య తొలి రోజున ప్రధాన ఉపన్యాసం చేశారు. తాను స్వయంగా తెలుగు ఆచార్యులు లాగా తెలుగు అభివృద్ధిని గురించి ఇతర ద్రావిడ భాషలకు విశ్వవిద్యాలయం ఇచ్చే ప్రాధాన్యం గురించి అనర్గళంగా ఉపన్యసించారు. 

ద్రావిడ విశ్వవిద్యాలయం రెండురోజువ ప్రత్యేకమైన తెలుగు పండుగను జరుపుకొంది. రెండవ రోజున జరిగిన సమాపన సభకు ముఖ్య అతిథిగా తెలుగు అధికార భాషాసంఘం అద్యక్షులు మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. ఆయన ఇచ్చిన ప్రత్యేక సందేశంలో తెలుగు భాష ఏవిషయంలోను ఏ కోణంలవోను ఏ భాషకు తక్కువది కాదని అతి మధురమైన భాష అని. తెలుగు సంస్కృతి ఏ సంస్కృతి కన్నా తక్కువదికాదని. స్వాతంత్ర్య 
పోరాటంలో తెలుగు వారి చాలా ముందున్నారని. భగత్ సింగ్‌ను గురించి మాట్లాడిన వారు జాతీయ స్థాయి నాయకుడైన అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడరని తమిళనాడులో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కూడా తెలుగు వారే ఉన్నారని చెప్పారు. తెలుగు భాష అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేయవలసినది అంతా చేస్తుంది అని చెప్పారు. ఈరోజున తెలుగు మాధ్యమంలో చదువు నడిపించడం గురించి కన్నా ముందు తెలుగు భాష అన్ని స్థాయిల విద్యలో ఉండేలా చేస్తున్నామని ఆప్రయత్నం సఫలమవుతుందని అన్నారు. తెలుగు పండుగ తిరుపతివలో జరగడం మరీ హర్షించదగిన విషయమని చెప్పారు. ఈ సభకు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య కంకణాల రత్నయ్య అధ్యక్షత వహించారు. తెలుగు ఇతర ద్రావిడ భాషల అభివృద్ధికి ద్రావిడ విశ్వవిద్యాలయం కంకణ బద్ధమైన ఉందని చెప్పారు. 
దీనికన్నా మొదటి రోజున జరిగిన సభలో ఆచార్య కంకణాల రత్నయ్యగారు ప్రధాన ప్రసంగం చేశారు. ఒక తెలుగు ఆచార్యుని స్థాయిలో ఉత్సాహభరితంగా సాగింది ఆ ఉపన్యాసం. తెలుగు అభివృద్ధికి ఎన లేని కృషి చేస్తామని నొక్కి వక్కాణించారు. మొదటి రోజుల తెలుగు సాహిత్యం భాష ఇతర సంస్కృతి అంశాలపై జరిగిన పోటీలలో విజేతలైన వారికి సమాపన సభలో బుద్ధప్రసాద్ గారు, రాధాకృష్ణరాజుగారు, రిజిస్ట్రార్ ఆచార్య ఆదినారాయణ రెడ్డిగారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సభలో తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు. ఇతర ఆచార్యులు పాల్గొన్నారు. 
రెండు రోజుల పండుగ విజయవంతంగా జరిగింది.

No comments:

Post a Comment